శుభవార్త.. 39 వేలకు పడిపోయిన బంగారం.. వెండి ధరలూ భారీ పతనం!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద శుభవార్తే. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. 22 క్యారెట్ల బంగారం 39 వేల స్థాయికి దిగొచ్చింది.

K V D Varma
Published on: 2 March 2020 9:16 AM IST
శుభవార్త.. 39 వేలకు పడిపోయిన బంగారం.. వెండి ధరలూ భారీ పతనం!
X

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద శుభవార్తే. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. 22 క్యారెట్ల బంగారం 39 వేల స్థాయికి దిగొచ్చింది.

ఈరోజు బంగారం ధర మళ్ళీ కిందకు దిగొచ్చింది. బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు తగ్గయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 750 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 44,410 రూపాయల నుంచి 43,660 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో తగ్గుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 850 రూపాయలు తగ్గింది. దీంతో 40,710 రూపాయల నుంచి 39,860 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగివచ్చింది.

మరికాస్త తగ్గిన వెండి ధరలు..

బంగారం ధర తో పాటు వెండి ధరలు కూడా వరుసగా రెండోరోజూ కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో శనివారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 1,070 రూపాయలు తగ్గి 49,570 రూపాయల నుంచి 48,500 రూపాయలకు తగ్గింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 43,360 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,860 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 1,070 రూపాయలు తగ్గింది. దీంతో కెజీ వెండి 48,500 రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,000 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసి 40,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా తగ్గింది. దీంతో కేజీ వెండి 48,500 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story