బంగారం పరుగులు.. వెండి రికార్డు దూకుడు!

బంగారం పరుగులు.. వెండి రికార్డు దూకుడు!
x
Highlights

బంగారం ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 01) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీస్థాయిలో పెరుగుదల నమోదు చేసి...

బంగారం ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 01) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీస్థాయిలో పెరుగుదల నమోదు చేసి కొత్త రికార్డులు సృష్టించాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (01.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 370 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,090 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 370 రూపాయలు పెరిగింది. దీంతో 49,160 రూపాయలకు చేరింది.

దూసుకెళ్లిన వెండి ధరలు...

బంగారం ధరలు కొద్దిగా పెరిగితే, వెండి ధరలు పైకి రివ్వున దూసుకెళ్లిపోయాయి. కొత్తరికార్డులు నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 1560 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రికార్డు మార్కుకు దాటింది. కేజీ వెండి ధర 50,110 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో.. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 370 రూపాయలు పెరుగుదల నమోదు చేసి, 45,710 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 370 రూపాయల పెరుగుదల నమోదు చేసి 49,160 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 50,110 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 210 రూపాయలు పెరిగి 47,510 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 210 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 45,710 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1560 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 50 వేల రికార్డు మార్కు దాటి 50,110 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories