Gold Rate Today: స్వల్ప ఊరట ఇచ్చిన బంగారం ధరలు.. వెండి మాత్రం పై పైకే!
శుక్రవారం ఒక్కసారిగా షాక్ ఇచ్చిన బంగారం ధరలు శనివారం కొద్దిగా ఉపశమించాయి. నిన్న భారీగా పెరుగుదల నమోదు చేసిన బంగారం ఈరోజు (01.02.2020) కాస్త తగ్గింది. ఒక పక్క పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం డిమాండ్ పెరిగింది. అయినా, మరోపక్క అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. అంతేర్ కాకుండా డాలరుతో రూపాయి కాస్త బలపడింది. దీంతో ధరలు కాస్త తగ్గాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కొద్దిగా తగ్గిన బంగారం..
మార్కెట్లో శనివారం బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 80 రూపాయలు తగ్గింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,410 నుంచి 42,330 రూపాయలకు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 80 రూపాయలు తగ్గడంతో 38,880 నుంచి 38,800 రూపాయల వద్దకు చేరుకుంది.
ఆగని వెండి పరుగులు..
ఒకవైపు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా.. వెండి ధరలు మాత్రం పరుగులు తీశాయి. ఈరోజు కేజీకి 50 రూపాయలు వెండి ధర పెరిగింది. దీంతో వెండి ధరలు కేజీకి 49,860 రూపాయల వద్దకు ఎగశాయి.
విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,330 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,800 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,860 రూపాయల వద్ద నిలిచింది.
దేశరాజధాని ఢిల్లీలోనూ..
ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 50 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,850 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,650 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,860 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.




