Gold rate: శుభవార్త! బంగారం ధరలు దిగివస్తున్నాయి.. వెండి కూడా కిందికి కదులుతోంది! ఈవారం పసిడి ధరలు ఇలా..

Gold Rate: ఈ వారాంతానికి బంగారం, వెండి ధరలు గత వారంతంతో పోలిస్తే కాస్త దిగివచ్చాయి. ఆ వారంలో బంగారం, వెండి ధరల కదలికలు ఇలా ఉన్నాయి

K V D Varma
Published on: 30 Aug 2020 7:31 AM IST
Gold rate: శుభవార్త! బంగారం ధరలు దిగివస్తున్నాయి.. వెండి కూడా కిందికి కదులుతోంది! ఈవారం పసిడి ధరలు ఇలా..
X

Gold rate analysis this week

Gold rate | బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది.

ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(ఆగస్టు 24) నుంచి శనివారం(ఆగస్టు 29) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

కిందికి దిగివచ్చిన పసిడి!

గత వారంలో (ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29 వరకు) బంగారం ధరలు ఒక్కరోజు మినహా మిగిలిన రోజుల్లో కొద్ది కొద్దిగా తగ్గుతూనే వచ్చింది. వారం అంతా కిందికే దిగివచ్చిన పసిడి ధరలు వారాంతానికి కూడా స్వల్ప తగ్గుదలతోనే ముగిశాయి.

అయితే, గత వారంతంలో ప్రారంభమైన పసిడి ధరల కింది చూపులు ఈ వారం ప్రారంభంలో కూడా కొనసాగాయి. ఆగస్టు 24 వతేదీ సోమవారం పది గ్రాములకు 490 రూపాయలు తగ్గిన బంగారం ధరలు వరుసగా మూడురోజుల పాటు అంటే బుధవారం (ఆగస్టు 26) వరకూ తగ్గుతూనే వచ్చాయి. ఆ మూడురోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం పదిగ్రాములకు 1,410 రూపాయలు తగ్గింది. మర్నాడు అంటే..గురువారం (ఆగస్టు 27) ఒక్కరోజూ 610 రూపాయల కొద్దిపాటి పెరుగుదల నమోదు చేసింది. ఇక అటు తరువాత రెండురోజులూ వరుసగా తగ్గుతూ వచ్చింది. చివరకు శనివారం ఆగస్టు 29న 140 రూపాయల తగ్గుదలతో వారాన్ని ముగించింది పసిడి. వారం మొత్తంగా చూసుకుంటే సోమవారం(24 ఆగస్టు) 22 కారెట్ల బంగారం పది గ్రాములకు 50,490 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(29 ఆగస్టు) సాయంత్రం 49,120 రూపాయల వద్ద ముగిశాయి. అంటే దాదాపు 1370 రూపాయల తగ్గుదల కనబరిచింది. ఇక 24 కారెట్ల బంగారం సోమవారం(24 ఆగస్టు)న పది గ్రాములకు 55,070 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(29 ఆగస్టు) సాయంత్రం 53,580 రూపాయల వద్ద ముగిశాయి. అంటే దాదాపు 1490 రూపాయల తగ్గుదల కనబరిచింది.

ఇక ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో పసిడి కాస్త నిదానించినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండి ధరలు కాస్త దిగొచ్చాయి..!

ఇక దేశీయంగా వెండి ధరలు కూడా కిందికీ మీదికి కదులుతూ వచ్చాయి. స్థిరం లేకుండా పెరిగినపుడు అమాంతం పెరగడం తగ్గినపుడూ అదే మాదిరిగా కిందికి పడిపోవడం జరుగుతూ వచ్చింది. వారం పొడవునా వెండి ధరలు అటూ ఇటూ కదిలాయి. వారం ప్రారంభంలో సోమవారం(ఆగస్టు 24) కేజీ వెండి 66,700 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ మర్నాడే అంటే మంగళవారం(ఆగస్టు 25) కేజే వెండి ధర ఒక్కసారిగా 1,200 రూపాయలు దిగజారింది... అటు తరువాతి రోజు అంటే బుధవారం(ఆగస్టు 26) 50 రూపాయల స్వల్ప పెరుగుదల చూపినా గురువారం(ఆగస్టు 27) ఇక ఆగస్టు 28 వెండి కేజీకి 800 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. మొత్తమ్మీద వారాంతానికి 350 రూపాయలు తగ్గి 66,350 రూపాయల వద్ద నిలిచింది.

ఇక శుభముహూర్తాలు కూడా ఏమీ లేకపోవడంతో వచ్చే వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చనీ.. కొద్దిపాటి తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉందనీ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!

K V D Varma

K V D Varma

Next Story