Gold rate: ఈవారంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు.. వెండి ధరలు మరింత కిందికి!

Gold rate: ఈవారంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు.. వెండి ధరలు మరింత కిందికి!
x
Highlights

Gold Rate: వారమంతా బంగారం, వెండి ధరలు కిందికే కదిలాయి. ఒక్కరోజు తప్ప మిగిలిన అన్నిరోజులూ కిందికి కదిలిన బంగారం, వెండి ధరలు వారాంతానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి.

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత తగ్గింది.. ఎంత పెరిగింది చూడడం సహజం..పదుల రూపాయల్లో పెరిగినా తరిగినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కానీ, బంగారం విషయంలో మాత్రం రూపాయి తగ్గినా..రూపాయి పెరిగినా అది పెద్ద విషయంలానే లేక్కేస్తారు.

ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(సెప్టెంబర్ 21) నుంచి శనివారం(సెప్టెంబర్ 26) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

వారం అంతా కిందికే దిగి వచ్చిన బంగారం!

గత వారంలో (సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 26 వరకు) బంగారం ధరలు తగ్గుతూనే వచ్చాయి. సోమవారం నుంచే తగ్గుదల కనబరుస్తూ వస్తున్నా బంగారం ధరలు వారం లో ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులూ కిందికి దిగివచ్చాయి. తగ్గుదల బాటలోనే వారం అంతా పసిడి ధరలు నడిచి వారాంతానికి కూడా తగ్గుదలతో నిలిచాయి. మొత్తమ్మీద చూసుకుంటే గత వారంకంటె ఈ వారాంతానికి బంగారం ధరలు బాగానే తగ్గాయి.

అయితే, గత వారంతంలో ప్రారంభమైన పసిడి ధరల పై చూపులు ఈ వారం కొనసాగలేదు. సెప్టెంబర్ 21 వతేదీ సోమవారం పది గ్రాములకు 250 రూపాయలు తగ్గిన బంగారం ధరలు తరువాతి రోజూ అంటే మంగళవారం (సెప్టెంబర్22) 590 రూపాయలు దిగివచ్చింది. బుధవారం (సెప్టెంబర్ 23) మరింత కిందికి అంటే పది గ్రాములకు 760 రూపాయలు తగ్గిన బంగారం ధరలు తరువాతి రోజు (సెప్టెంబర్ 24)నా 600 రూపాయలు తగ్గాయి. అంటే ఈ రెండురోజులూ కలిపి 1360 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. ఈ మధ్యకాలంలో బంగారం ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. ఇక అటు తరువాత రోజు(సెప్టెంబర్ 25) 500 రూపాయలు పెరిగాయి. దీంతో నాలుగు రోజులు వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడినట్టయింది. అయితే.. మళ్ళీ శనివారం బంగారం ధరలు మళ్ళీ కిందకు దిగి వచ్చాయి. చివరకు శనివారం సెప్టెంబర్ 26న 230 రూపాయల తగ్గుదలతో వారాన్ని ముగించింది పసిడి. వారం మొత్తంగా చూసుకుంటే సోమవారం(సెప్టెంబర్21) 22 కారెట్ల బంగారం పది గ్రాములకు 49,590 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 26) సాయంత్రం 47,800 రూపాయల వద్ద ముగిశాయి. అంటే 1790 రూపాయల తగ్గుదల కనబరిచింది. ఇక 24 కారెట్ల బంగారం సోమవారం(సెప్టెంబర్ 21)న పది గ్రాములకు 54,070 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(సెప్టెంబర్26) సాయంత్రం 52,140 రూపాయల వద్ద ముగిశాయి. అంటే వారం మొత్తం చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం దాదాపు 1930 రూపాయల భారీ తగ్గుదల కనబరిచింది.

ఇక ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో పసిడి కాస్త నిదానించినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండి ధరలు పతనం!

ఇక దేశీయంగా వెండి ధరలు ఈవారం భారీ పతనాన్ని చూశాయి. వారం పొడవునా వెండి ధరలు తగ్గుతూనే వచ్చాయి. ఒక్క శుక్రవారం మాత్రం కాస్త పెరుగుదల నమోదు చేశాయి. . వారం ప్రారంభంలో సోమవారం(సెప్టెంబర్ 21) కేజీ వెండి 67,210 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ రోజు కేజే వెండి ధర 900 రూపాయలు తగ్గింది.... అటు తరువాతి రోజు అంటే మంగళవారం(సెప్టెంబర్ 22) వెండి ధరలు షాకిచ్చాయి. ఏకంగా కేజీకి 6400 రూపాయల తగ్గుదల చూపించాయి. ఇక ఆ మర్నాడు (సెప్టెంబర్23) కూడా అదే స్థాయిలో 1600 రూపాయలు దిగివచ్చింది. మళ్ళీ సెప్టెంబర్24 వతేదీ గురువారం 2000 రూపాయలు కిందికి దిగింది. అయితే ఆ మర్నాడు సెప్టెంబర్ 25 న ఒక్కసారిగా 2300 రూపాయలు పెరిగింది. ఇక శనివారం మళ్ళీ 300 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. ఇలా వారం అంతా వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేస్తూ వచ్చాయి. మొత్తమ్మీద వారాంతానికి 67,900 రూపాయల నుంచి 59,300 స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. అంటే ఒక్క వారంలో కేజే వెండి 8,600 రూపాయలు తగ్గింది. ఇటీవలి కాలంలో వెండికి ఇదే భారీ పతన పరిస్థితి.

ఇక శుభముహూర్తాలు కూడా ఏమీ లేకపోవడంతో వచ్చే వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చనీ.. కొద్దిపాటి తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉందనీ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!

Show Full Article
Print Article
Next Story
More Stories