Gold Rates Today: స్థిరంగా 40 వేలకు చేరువలోనే బంగారం.. మార్పులు లేని వెండి ధర!

K V D Varma
Published on: 11 Oct 2019 9:04 AM IST
Gold Rates Today: స్థిరంగా 40 వేలకు చేరువలోనే బంగారం.. మార్పులు లేని వెండి ధర!
X

నిన్న 40 వేలరూపాయల చేరువలోకి వచ్చిన బంగారం ధరలు ఈరోజు అదే రేటు వద్ద స్థిరంగా ఉన్నాయి.శుక్రవారం దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,980 వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,650 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధరలోనూ మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ వెండి ధర 48,500 రూపాయల వద్ద నిలకడగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,980, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,650 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,500 రూపాయల వద్దే ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 37,450 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర కూడా ఎలాంటి మార్పులు లేకుండా 48,500 రూపాయలవద్ద నిలిచింది.


K V D Varma

K V D Varma

Next Story