Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఆరువందలకు పైగా తగ్గి ధర 38,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఆరువందల వరకూ తగ్గి 35,450 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర నిలకడగానే ఉంది. కేజీ వెండి ధర 48,100 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,000 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 36,200 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. కేజే వెండి ధర 48,100 రూపాయలుగా ఉంది.
Next Story


