Gold Rates today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

K V D Varma
Published on: 14 Oct 2019 7:12 AM IST
Gold Rates today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
X

ఆదివారం కొద్దిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.. సోమవారం దేశీయంగా బంగారం ధరలు ష్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 39,770 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 36,450 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలోనూ మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ వెండి ధర 48,550 రూపాయల వద్ద నిలకడగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,770, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,450 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 38,260 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 10 రూపాయలు పెరిగి 37,210 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా ఎలాంటి మార్పులు లేకుండా 48,550 రూపాయలవద్ద నిలిచింది.


K V D Varma

K V D Varma

Next Story