యుద్ధ భయాలు.. పెరుగుతున్న బంగారం..పెట్రోల్ ధరలు! ఆందోళనకరంగా భారత్ ఆర్ధిక రంగం

యుద్ధ భయాలు.. పెరుగుతున్న బంగారం..పెట్రోల్ ధరలు! ఆందోళనకరంగా భారత్ ఆర్ధిక రంగం
x
trump and khasim file images (representaional image)
Highlights

అమెరికా ఇరాన్ ల మధ్య కమ్ముకున్న ఉద్రిక్తతలు భారత్ ఆర్ధికరంగానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల తో ఎన్నో వస్తువుల ఎగుమతులు దిగుమతులు ప్రభావితం...

అమెరికా ఇరాన్ ల మధ్య కమ్ముకున్న ఉద్రిక్తతలు భారత్ ఆర్ధికరంగానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల తో ఎన్నో వస్తువుల ఎగుమతులు దిగుమతులు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, బంగారం, టీ, బాస్మతి రైస్ వంటి వాటిపై తక్షణ ప్రభావం కనిపిస్తోంది. ఈ యుద్ద వాతావరణంతో వీటిలో కొన్నిటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరి కొన్నిటి ఎగుమతులు క్లిష్టమైపోయాయి. ఈ అంశాలు మన దేశ ఆర్ధిక రంగానికి ఆశనిపాతమనే చెప్పాలి. ఇప్పటికే ఆర్ధిక మందగమనంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న ఆర్ధిక రంగం ఇప్పుడు ఈ పరిస్థితులతో మరింత గడ్డు కాలాన్ని చూడాల్సి వస్తోంది.

క్రూడాయిల్ పరుగులు..

ఈ యుద్ధ వాతావరణంతో తక్షణం ప్రభావితమైన రంగం క్రూడాయిల్. మన దేశ దిగుమతుల్లో ముఖ్యంగా ఇరాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల్లో సింహ భాగం క్రూడాయిల్ దే! ఈ నాలుగైదు రోజుల్లోనే బ్రెంట్ క్రూడాయిల్ 4 శాతం పెరిగింది. దీంతో బ్యారెల్ ధర 70 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే తొందర్లోనే ఇది 80 డాలర్లకు చేరుకోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. అదే జరిగితే భారత్ ఆర్ధిక రంగానికి అది పెద్ద సవాల్ గా మారుతుందనడం లో సందేహం లేదు.

బంగారం భగ భగలు!

ఇన్వెస్టర్లు ఎప్పుడూ సురక్షిత సాధనాల వైపే చూస్తారు. చాలా కాలంగా ఇన్వెస్టర్లు బంగారం పై మదుపు చేయడాన్ని సురక్షితంగా భావిస్తున్నారు. ఇప్పుడు అమెరికా దుడుకు వైఖరితో ఇరాన్ కమాండర్ ఖాసిం ను హతమార్చడంతో పరిస్థితులు మారిపోయాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రపంచం మొత్తం ఉంది. ఈ నేపధ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర అనిస్చితితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో బంగారం వైపు వారి చూపు పడింది. ఈ ఉద్రిక్తతలు ప్రారంభం అయిన వెంటనే బంగారం ధర పెరగడం ప్రారంభం అయింది. ఇప్పటివరకూ దాదాపు 1500 రూపాయల వరకూ ఈ ధరలు పెరిగాయి. అమెరికా-చైనాల మధ్యలో నెలకొన్న వాణిజ్య యుద్ధం నేపధ్యంలో మొన్నటి వరకూ ఇన్వెస్టర్లు బంగారం వైపు చూశారు. అయితే, ఆ పరిస్థితులు సర్డుమనిగాయి..కానీ, ఇప్పుడు ఇరాన్-అమెరికా భయం వారిని వెంతాడుతుండటంతో మళ్ళీ బంగారం వైపు చూపు సారించారు. దీంతో ఈ దాడుల తరువాత అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 25 డాలర్లు పెరిగిపోయింది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎగుమతులపై ఎఫెక్ట్!

మన దేశం నుంచి ఇరాన్ నేరుగా తీ పొడిని దిగుమతి చేసుకుంటుంది. మన టీకి ఇరాన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గత ఏడాది సీఐఎస్ దేశాలన్నిటికీ కలిపి భారత్ 5.28 కోట్ల కిలోల టీ పొడిని ఎగుమతి చేసింది. దానిలో ఒక్క ఇరాన్ దేశానికే 5.04 కోట్ల కోలోల టీపొడి ఎగుమతి చేసింది. ఇప్పుడు ఇరాన్ ఉన్న పరిస్థితుల్లో భారత్ నుంచి ఎగుమతి అయ్యే టీపొడి పై గట్టి ప్రభావం పడే చాన్స్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిలిచిపోయిన బాస్మతి ఎగుమతులు..

ఇరాన్ కు మనదేశం నుంచి అయ్యే ఎగుమతుల్లో మరో ప్రధనమైన వనరు బాస్మతి రైస్. గత క్వార్టర్ లో భారత్ 32,800 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో 10,800 కోట్ల బాస్మతి ఇరాన్ కే ఎగుమతి అయింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో నవంబర్ వరకూ 17,700 కోట్ల విలువైన బాస్మతి ఎగుమతి జరిగింది. దానిలో 4,500 కోట్ల ఎగుమతులు ఇరాన్ కే జరిగాయి. ఇప్పుడు ఇరాన్ ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ ఎగుమతులపై పడే ప్రభావం దేశంలోని రైతుల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

మొత్తమ్మీద ఇరాన్ అమెరికాల మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర మైన ఉద్రిక్తతల నేపధ్యంలో భారత ఆర్ధిక పరిస్థితి ఇక్కట్ల పాలవుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో పెట్రోల్ మంటలు సామాన్యులకు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories