YSRCP: సీఎం జగన్‌ చేతుల మీదుగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల

YSRCP: 9 ముఖ్య హామీలతో వైసీపీ మేనిఫెస్టో 2024

Shashank Gullapelli
Updated on: 27 April 2024 3:22 PM IST
YSRCP Manifesto Released By CM Jagan
X

AP News: సీఎం జగన్‌ చేతుల మీదుగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల

YSRCP: ఏపీ గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్‌ చెప్పారు. తాడేపల్లి వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారాయన.

మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని అన్నారు జగన్... గతంలో ఎన్నికలప్పుడు రంగు రంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ, మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించామని, గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందని, రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను పంపించామన్నారు.. ఓ ప్రొగ్రెస్‌ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామన్నారు. 58 నెలల్లో పథకాల్ని డోర్‌ డెలివరీ చేశామన్నారు ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామన్నారు ఏపీ సీఎం జగన్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story