Top
logo

కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి : ఏపీ సీఎం జగన్

కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి : ఏపీ సీఎం జగన్
Highlights

కేంద్రంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సులో అయన మాట్లాడారు.

కేంద్రంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సులో అయన మాట్లాడారు. తమకు పొరుగు రాష్ట్రాలతోనూ సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తాము నిజాయతీ కలిగిన పరిపాలన అందిస్తామని సదస్సులో అయన చెప్పారు. కేంద్రం తమకు అండగా వుందని వివరించారు. మంచి నగరం లేకపోవడం లోటుగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మంచి అవకాశాలున్నాయన్నారు. తమ ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందనీ, రెండు నెలల్లోనే మార్పులు తీసుకోచ్చామనీ జగన్ చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి మంచి అవకాశాలు కల్పిస్తామని అయన హామీ ఇచ్చారు.లైవ్ టీవి


Share it
Top