Tirumala: బిగ్ అలర్ట్..శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే వీఐపీ వసతి గదులు

Tirumala: తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది.

Dhivi
Updated on: 2 March 2025 8:00 AM IST
Tirumala: బిగ్ అలర్ట్..శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే వీఐపీ వసతి గదులు
X

Tirumala: తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది. దర్శన టికెట్ ఉన్న వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తోంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తోంది. 1580 గదులు అడ్వాన్స్ బుకింగ్ కు , 400 గదులు దాతలకు కేటాయిస్తోంది టీటీడీ. 450 గదులను అరైవల్ కింద, మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీలకు జారీ చేస్తోంది. వీటిని శ్రీ పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో పొందవల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డుతోపాటు దర్శన టికెట్ ను తప్పనిసరి చేసింది.

గతంలో వీఐపీ గదులను ఆధార్ తో దళారులు పెద్దెత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. 48గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు, ముగ్గురు భక్తులకు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్నవారికే వసతి కల్పించడంతోపాటు దర్శనాంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోందని టీటీడీ తెలిపింది. దీంతో ఆదాయం కూడా పెరిగింది.

Dhivi

Dhivi

Next Story