Thirupathi MP Passed Away: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత

Thirupathi MP Balli Durga prasad Died In chennai hospital
Thirupathi MP Passed Away: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలం ఆనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేరారు.
Thirupathi MP Passed Away: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలం ఆనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. దుర్గాప్రసాద్ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంపీ దుర్గాప్రసాద్ హఠాన్మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బల్లి దుర్గాప్రసాద్ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీ దుర్గాప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.