ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య కుదరని ఏకాభిప్రాయం

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య కుదరని ఏకాభిప్రాయం
x
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇన్నాళ్లూ నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మరోసారి...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇన్నాళ్లూ నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మరోసారి రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల చర్చలు జరిపినా సర్వీసుల ప్రారంభంపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. తెలంగాణ ప్రతిపాదించిన రూట్ క్లారిటీ పై ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎటూ తేల్చుకోకపోవడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసాయి. ఇక రెండు మూడు రోజుల్లో ఇరు రాష్ట్రాల ఈడీ లు మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల్లో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలకు కేంద్రం అనుమతిచ్చింది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ రాకపోకలు నడవడం లేదు. బస్సు సర్వీసులను నడిపే విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ పునర్విభజన చట్టంలోని మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బస్సులు ఎలా కొనసాగుతున్నాయో ప్రస్తుతం కూడా అలాగే నడుస్తున్నాయి. దీని ప్రకారం తెలంగాణ ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుండడంతో లాక్ డౌన్ తో ఆగిపోయిన బస్సులు ఒప్పందం తరువాతే పునప్రారంభం చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు 3.43లక్షల కిలోమీటర్ల మేర నడిచేవి. రాష్ట్ర విభజన తరువాత దానిని 2.65 లక్షల కిలోమీటర్లకు తగ్గించారు. అయితే కోవిడ్ తరువాత ఖచ్చితంగా అంతరాష్ట్ర ఒప్పందం జరిగాకే బస్సులు తిప్పాలని సమన్యాయం పాటించాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఏపీలో లక్షా 10 వేల కిలోమీటర్లు తిరుగుతుండడంతో దానిని లక్షా 60 వేల కిలోమీటర్ల పెంచడానికి తెలంగాణ ఆర్టీసీ అంగీకరించిందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు తెలిపారు. కానీ ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగిందన్నారు. ఒప్పందం కుదిరే వరకు ఇరు రాష్ట్రాలు చెరో 250 బస్సులు తిప్పడానికి ప్రతిపాదించినా తెలంగాణ అంగీకరించలేదన్నారు.

ఇటు తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఒప్పందం కుదిరితే గాని బస్సులు తిప్పేది లేదన్నట్లు వ్యవహరిస్తోంది. తాము అడిగిన రూట్లా వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడిపే విధంగా ప్రపోజ్ చేశామని తెలంగాణ ఆర్టీసీ ఇంచార్జి ఎండి సునీల్ శర్మ తేల్చి చెప్పారు. రూట్ల వారీగా క్లారిటీ ఇస్తేనే ముందుకు వెళ్తామంటున్నారు. త్వరలోనే మరోమారు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరపనుండటంతో ఈ సారైనా ఏకాభిప్రాయం కుదురుతుందా బస్సు సర్వీసులు పున‌:ప్రారంభం అవుతాయా అనే సందేహం మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories