సీబీ'ఐ' కే ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం !

సీబీఐ కే ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం !
x
Highlights

సీబీఐ.. ఇప్పుడు ఈ పదం ఏపీలో అత్యధికంగా వినిపిస్తోంది. కీలకమైన ప్రతి కేసు లింకును కూడా లాగాలంటూ ప్రభుత్వం సీబీఐకే అప్పగిస్తోంది. ఏదైనా...

సీబీఐ.. ఇప్పుడు ఈ పదం ఏపీలో అత్యధికంగా వినిపిస్తోంది. కీలకమైన ప్రతి కేసు లింకును కూడా లాగాలంటూ ప్రభుత్వం సీబీఐకే అప్పగిస్తోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు విమర్శలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ వైపే చూస్తోంది. తన తప్పు లేదని ఫ్రూవ్ చేసుకోవడానికి సీబీఐకే కీలక కేసులు అప్పగిస్తోంది. తాజాగా అంతర్వేది ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చింది సీబీఐ. మరోవైపు సీబీఐ వద్దన్న చంద్రబాబు ఇప్పుడు సీబీఐని కోరడంతో దానితోనే సమాధానం చెప్పాలని జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందా..? వాచ్ దిస్ స్టోరీ..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కేసును సీబీఐకే అప్పగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే విశాఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసుతో పాటు వైఎస్ వివేకా హత్య కేసు, అమరావతి భూముల విషయంలో టీడీపీ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఆరోపణల కేసు అలాగే సుగాలి ప్రీతి హత్య కేసు, తాజాగా అంతర్వేది రథం ఘటనతో కలిపి మొత్తం 5 కేసులను సీబీఐకు అప్పగించింది ఏపీ సర్కార్. అయితే ప్రతిపక్షం నోరు మూయించడానికే ఏపీ ప్రభుత్వం ప్రతి కేసును సీబీఐకి అప్పగిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అంతర్వేది ఘటన కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతల నోటికి తాళం పడింది.

జగన్ ప్రభుత్వంపై మొదటినుంచీ చంద్రబాబు ఒంటికాలుపై లేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు రాష్ట్రానికే సీబీఐని రానివ్వకూడదన్న బాబు ఇప్పుడు మాట్లాడితే చాలు ప్రతి కేసుపై సీబీఐ ఎంక్వైరీని కోరుతున్నారు. దీంతో సీబీఐతోనే చంద్రబాబుకు సమాధానం చెప్పాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టీడీపీ కానీ విపక్షాలు కానీ ఎప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరితే అప్పుడు సీబీఐ విచారణకు ఆదేశిస్తోంది జగన్ సర్కార్. తాజాగా అంతర్వేది రథం ఘటనను సీబీఐకి అప్పగించి విపక్షాల నోరు మూయించింది ఏపీ ప్రభుత్వం.

మరోవైపు మతం పేరుతో జరుగుతున్న వరుస పరిణామాలపై ఏపీ సర్కార్ చాలా సీరియస్‌గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మతం పేరుతో జరిగిన వరుస పరిణామాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించనుంది. అంతర్వేది రథం దగ్ధం కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనల విచారణను సీబీఐకు అప్పజెప్పాలని భావిస్తోంది. అంతేకాదు తిరుమల బస్సులపై శిలువ బొమ్మలు, టీటీడీ వెబ్ సైట్, సప్తగిరి మాసపత్రికలో అన్యమత ప్రస్తావన వంటి వాటిని కూడా సీబీఐ విచారణ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. పిఠాపురం, నెల్లూరు ఘటనలతో పాటు టీటీడీ ఛైర్మన్‌పై దుష్ర్పచారం ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని యోచిస్తోంది. వీటన్నింటికి సంబంధించి ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో జరుగుతున్న అన్ని కుట్రలకు సీబీఐ విచారణతో ఫుల్‌స్టాప్ పెట్టాలని జగన్ ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories