
లాక్ డౌన్ కారణంగా సుమారుగా 90 రోజులు మూసివేసిన దేవాలయాలు ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి.
లాక్ డౌన్ కారణంగా సుమారుగా 90 రోజులు మూసివేసిన దేవాలయాలు ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి.కేంద్రం దీనిపై ఆదేశాలు జారీ చేయడంతో దర్శనాలను మార్గం సుగమమయ్యింది. అయితే రెడ్ జోన్లో ఉన్న ఆలయాల దర్శనాలను మాత్రం ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ దర్శనం జరిగేలా అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. వీటితో పాటు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో దర్శనాలను ట్రయల్ రన్ చేస్తున్నారు. వీటితో పాటు అన్ని జిల్లాల్లో ఉన్న ఆలయాలన్నీ తెరిచి, దర్శనాలు ప్రారంభించేందుకు అదికారులు ఏర్పాటు చేశారు.
విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 90 రోజులు తరవాత తెరుచుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు సిబ్బందితో ట్రయల్ దర్శనాలు ప్రారంభించారు. రేపు పూర్తిస్థాయిలో ప్రజలకు దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దర్శనానికి వచ్చిన వారికి శానిటైజర్ చేసి పంపుతున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శనాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేసి జనాలను నిలువరిస్తున్నారు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ రోజు దర్శనాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా తొలుత మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..చరిత్రలో ఇన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా దేవాలయాలు మూతపడటంతో చాలా అరుదైన విషయమన్నారు.. ప్రతి ఒక్కరు ప్రకృతికి తలవంచాల్సిందేనని, రానున్న కాలంలో కరోనా నుంచి దేవుడు ప్రజలు కాపాడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉందని పేర్కొన్నారు.
కడప జిల్లా...
కరోనా వైరస్ కారణంగా మూతబడిన గండి ఆంజనేయ స్వామి ఆలయం సోమవారం తెరుచుకుంది. ఈ రోజు ఉదయమే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది తో క్యూ లైన్ లో భౌతిక దూరం పాటిస్తూ ట్రయల్ రన్ నిర్వహించారు. నేడు రేపు స్థానికుల కు మాత్రమే అనుమతిస్థామని ఈవో తెలిపారు. ఇవే కాకుండా మిగిలిన ఎటువంటి ఆర్జిత సేవలు ,తీర్థ ప్రసాదాలు లేకుండా దూరం నుండే స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్ళేటట్లు ఏర్పాటు చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



