AV Subba Reddy Meets SP Anburajan : అఖిల ప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు : ఏవీ సుబ్బారెడ్

AV Subba Reddy Meets SP Anburajan : ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, అతని కుమార్తె జస్వంతి కడప జిల్లా...
AV Subba Reddy Meets SP Anburajan : ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, అతని కుమార్తె జస్వంతి కడప జిల్లా ఎస్పీని ఈ రోజు కలిసారు. తనపై హత్యా యత్నం జరిగిన కేసు విషయమై ఎస్పీ అన్బు రాజన్ ను కలిసారు. అనంతరం ఏవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భూమా అఖిల ప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని కడపజిల్లా ఎస్పీని కోరామని తెలిపారు. భూమా అఖిలప్రియను అరెస్టు చేయకపోవడం వెనుక ఏదైనా మతలబు జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన ఎస్పీ అన్బు రాజన్. ప్రొసీజర్ ప్రకారమే కేసు ముందుకు నడుస్తోందనీ తెలిపారు. ఏ4 అయిన భూమా అఖిల ప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నిస్తున్నా..? అని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.
ఏ1 నుండి ఏ6 వరకు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు ఏ4ను ఎందుకు వదిలేశారన్నారు. నన్ను హత్య చేసేందుకు భూమా కుటుంబం సఫారీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నొక్కి వక్కాణించారు. ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చినా అఖిల ప్రియ, ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికే పరిస్థితి లేదనీ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే నాపై మళ్లీ దాడిచేసి అవకాశాలున్నాయన్నారు. నోటీసులకు స్పందించని అఖిలప్రియ, ఆమె భర్త నిర్భయంగా బయట తిరుగుతున్నారనీ అన్నారు.
అనంతరం జస్వంతి మాట్లాడుతూ.. భూమా అఖిలప్రియ మహిళ ముసుగులో హత్యా రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకొని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాంను వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో రాజకీయంగా ఎదుర్కోలేమనే మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారనీ స్పష్టం చేశారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Hyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా..!
26 Jun 2022 8:19 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMTMekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMT