అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
x
YCP MLA Hafeez Khan
Highlights

ఒక పక్కా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాజకీయనాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది.

ఒక పక్కా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాజకీయనాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది.తాజాగా కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, టీడీపీ మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వల్లే కర్నూలులో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందంటూ భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను అయన ఖండించారు.

ఒకవేళ నా వల్ల, కర్నూలు ఎంపీ వల్ల కరోనా వ్యాపించిందని ఆమె నిరూపిస్తే రాజుగారి సెంటర్ వద్ద మమల్ని ఉరితీయండి అంటూ బహిరంగగా సవాల్ విసిరారు. జిల్లా సమస్యలు తెలియని అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు.కరోనా వైరస్‌ అపోహల్ని ముస్లింలపై రుద్దడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కర్నూలు కష్టాలు తెలియని అఖిల ప్రియ మానవత్వం చూపాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories