పాయకరావుపేట ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో కరోనా పాజిటివ్ కేస్ నమోదైన నేపథ్యంలో... పాయకరావుపేటలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

S. Srikanth
Updated on: 9 April 2020 7:12 PM IST
పాయకరావుపేట ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు
X

పాయకరావుపేట: తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో కరోనా పాజిటివ్ కేస్ నమోదైన నేపథ్యంలో... పాయకరావుపేటలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత మార్చి 25 వ తేదీన పట్టణంలోని రాజుగారిబీడు సమీపంలో నివాసం ఉండే వ్యక్తి... కుటుంబ సభ్యులతో కలిసి, తన అత్తవారి ఊరు కత్తిపూడి వెళ్ళాడు. అయితే అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయని కాకినాడ తరలించగా పాజిటివ్ అని తేలింది.

సదరు టీచర్ ఈ మధ్య కాలంలో పాయకరావుపేట విచ్చేసి... ఎవరినైనా కలిసారా అనే అనుమానంతో సిఐ విజయకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి తాలూకు బంధువులు, స్నేహితులను ఆరా తీస్తున్నారు. అతను నివాసం ఉండే ఇంటి పక్కన ఉండే స్థానికులకు హౌస్ క్వారంటైన్ ఉండాలని పోలీసులు సూచించారు. వీధిలోకి ఎవరూ ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.






S. Srikanth

S. Srikanth

Next Story