విశాఖ ఎంపీ ఫ్యామిలీ సేఫ్.. కిడ్నాప్ అయిన గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

Mp Satyanarayana: కుటుంబ సభ్యులను సురక్షితంగా విశాఖకు తరలింపు

Dhatripriya
Updated on: 15 Jun 2023 4:14 PM IST
Mp Satyanarayana: కుటుంబ సభ్యులను సురక్షితంగా విశాఖకు తరలింపు
X

విశాఖ ఎంపీ ఫ్యామిలీ సేఫ్.. కిడ్నాప్ అయిన గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

Mp Satyanarayana: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ముగ్గురు డీసీపీలతో 15 బృందాలుగా గాలించడంతో ఎనిమిది గంటలలో పోలీసులు కేసును చేధించారు. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు వాళ్ల ఫ్యామిలీకి సన్నిహితుడు, ఆడిటర్‌, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులు చేజింగ్ చేసే సమయంలో పోలీసు కారు ఢీకొట్టడం వల్ల వారికి కొద్దిపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీవీతోపాటు ఎంపీ కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ... జీవీకి ఫోన్ చేయడంతో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులు ఆయన ఫోన్ ట్రాక్ చేయడంతో పద్మనాభం వైపు వెళుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఆ వైపుగా ఛేజింగ్ చేసి ఎంపీ కుటుంబ సభ్యులను సురక్షితంగా విశాఖపట్నానికి తరలించారు. అయితే, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేవలం డబ్బు కోసమే ఈ వ్యవహారం నడిచిందని తనకు ఎవరూ శత్రువులు లేరని తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story