నైరుతిపై చల్లని కబురు.. ఏపీకి మూడు రోజుల్లో రాక

admin1
Updated on: 7 Jun 2020 10:17 AM IST
నైరుతిపై చల్లని కబురు.. ఏపీకి మూడు రోజుల్లో రాక
X

నైరుతి రుతువపనాలపై వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలోకి ఇవి ప్రవేశించినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఇబ్బందలు పడుతున్న జనాలకు ఈ విషయం కాస్త తీపి పంచినట్టయింది. అయితే ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతువపనాల వల్ల పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం ఎండలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం మరో మూడు రోజుల్లో ఏపీకి వచ్చి, వీటి ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రానున్న రెండు, మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారంకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అరకభద్ర (ఇచ్ఛాపురం)లో 7, పెందుర్తిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడిన తరువాత కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరగనున్నాయి. రానున్న రెండ్రోజుల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి. ఈనెల 9, 10 తేదీల్లో విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. ఉండిలో 43.38, మక్కువలో 43.23, చీమకుర్తిలో 43.17 ఉష్ణోగ్రత నమోదైంది.


admin1

admin1

Next Story