YS Jagan: 7 నెలల తర్వాత అసెంబ్లీకి జగన్

Dhivi
Published on: 23 Feb 2025 6:57 AM IST
Jagan to the assembly after 7 months
X

YS Jagan: 7 నెలల తర్వాత అసెంబ్లీకి జగన్

YS Jagan: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడానికి రెడీ అయ్యారు. సోమవారం ఉదయం సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ సమయానికి సభకు హాజరు కావాలని వైసీపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం 9గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి రావాలని హైకమాండ్ సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. ఆయన చివరిసారి గత ఏడాది జులైలో అసెంబ్లీ సమావేశాలప్పుడు రెండు రోజులు వచ్చారు. తర్వాత నవంబర్ లో జరిగిన సమావేశాలకు దూరంగా ఉన్నారు.

ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం తర్వాతి రోజు నుంచి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది స్పష్టత లేదు. జగన్ రాకుండా ఎమ్మెల్యేలను మాత్రం సభకు పంపించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ లో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా..జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి మీడియా ద్వారా మాట్లాడారు. తర్వాత కూడా అదే పద్దతిలో అసెంబ్లీకి వెళ్లకుండా మీడియా ద్వారానే మాట్లడాతానని అప్పట్లో ప్రకటించారు. ఈనెల 6న ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్న జగన్..అప్పుడు కూడా అసెంబ్లీలో వాళ్ల ముందుకు వెళ్లే మాట్లాడాలా ఇలాగే ఇక్కడ మీడియా ద్వారా మాట్లాడతా వాళ్లకు సమాధానం చెప్పమనండి అంటూ ప్రకటించారు.

Dhivi

Dhivi

Next Story