కోనసీమలోని లంక గ్రామాలలో తగ్గని వరద ఉధృతి

K V D Varma
Published on: 5 Aug 2019 10:04 AM IST
కోనసీమలోని లంక గ్రామాలలో తగ్గని వరద ఉధృతి
X

కోనసీమలోని లంక గ్రామాలలో తగ్గని వరద ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. నీటి ముంపులోనే అయినవిల్లి లంక, కనాకాయిలంక కాజ్‌వేలు, రాజోలు దీవిలో వరద ముంపులో ఏడు లంక గ్రామాలు జల దిగ్భంధంలో మునిగిపోయాయి. లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. సఖినేటిపల్లి- నర్సాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం, కాట్రేనికోన, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు, తాళ్లరేవు, ఐ.పోలవరం, అల్లవరం మండలాల్లో గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.



K V D Varma

K V D Varma

Next Story