ఈడీ కేసులో జగన్‌కు చుక్కెదురు
వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి చుక్కెదురయింది. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో ఈడీ కేసులో ఇక నుంచి జగన్ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావలసి ఉంటుంది.
ఆస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ ఇవాళ కోర్టుకు హాజరు కాలేదు. ఇదే కేసుకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మీ, వీడి రాజగోపాల్ కోర్టుకు హాజరయ్యారు. సీఎం జగన్ కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తరపు న్యాయవాది ఆప్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఈ నెల 31 కి వాయిదా వేసింది కోర్టు
Next Story




