Covid19 Updates in AP: ఏపీలో 22,305 కరోనా టెస్టులు.. 570 కేసులు

Covid19 Updates in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులొచ్చాయి.

Raj
By Raj
Published on: 26 Jun 2020 2:04 PM IST
Covid19 Updates in AP: ఏపీలో 22,305 కరోనా టెస్టులు.. 570 కేసులు
X

Covid19 Updates in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులొచ్చాయి. గత 24 గంటల్లో 22 వేల 305 సాంపిల్స్ ను పరీక్షించగా 570 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11498 కు చేరింది. ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే కొత్తగా కృష్ణలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ఒకరు , విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దాంతో మరణాల సంఖ్య 146 కు చేరింది.

కేవలం రాష్ట్రంలో నమోదైన మొత్తం 9353 పాజిటివ్ కేసులకు గాను కొత్తగా 191 మంది కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకూ 4021 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 5186 చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే జిల్లాల వారీగా యాక్టీవ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. చిత్తూరు 429, ప్రకాశం 111, అనంతపురం 764, కడప 388, కర్నూల్ 694, నెల్లూరు 227, గుంటూరు 477, కృష్ణ 626, పశ్చిమ గోదావరి 643, తూర్పు గోదావరి 519, విశాఖపట్నం 201, విజయనగరం 83, శ్రీకాకుళం 24 కేసులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల వారు 672 మంది, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 289 మంది కోలుకోవాల్సి ఉంది.

Raj

Raj

Next Story