లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి చిత్తూరులో కరోనా పూజలు

Arun Chilukuri
Updated on: 22 April 2020 11:27 AM IST
లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి చిత్తూరులో కరోనా పూజలు
X

భక్తులు లాక్‌డౌన్‌ నిబంధనలు తుంగలో తొక్కారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చిత్తూరు జిల్లా కొండసముద్రం గ్రామంలో స్థానికులు కరోనా రావొద్దంటూ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గుంపులు గుంపులుగా బయటకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాళ్లపై బొమ్మలు చిత్రీకరించి పూజలు చేశారు. గ్రామంలోకి వైరస్ రావొద్దంటూ మొక్కుకున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అయితే ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. మాస్క్‌లు ధరించి.. సామాజిక దూరం పాటిస్తే.. కరోనా దరిచేరదని ప్రభుత్వాలు చెబుతుంటే వాటిని పట్టించుకోలేదు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story