Coronavirus Updates in AP: 24 గంటల్లో 9,276 కొత్త కేసులు.. 58 మంది మృతి..

Arun Chilukuri
Published on: 1 Aug 2020 5:49 PM IST
Coronavirus Updates in AP: 24 గంటల్లో 9,276 కొత్త కేసులు.. 58 మంది మృతి..
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,276 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 60,797 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,276 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 12,750 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల తూర్పుగోదావరిలో 8మంది, విశాఖపట్నంలో 8, గుంటూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు కరోనాతో మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 1,47,314. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,407 . ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 73,719 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 72,188 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 60,797 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 20,12,188 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story