Manikyala Rao dies of coronavirus : క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి

Arun Chilukuri
Published on: 1 Aug 2020 4:14 PM IST
Manikyala Rao dies of coronavirus : క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి
X

Manikyala Rao dies of coronavirus: బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా వైరస్‌తో కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు.

పశ్చిగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు ఆయన మంత్రిగా కొనసాగారు. కాగా మాణిక్యాల రావు మృతి ప‌ట్లు పలువురు రాజ‌కీయ నాయ‌కులు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story