ఏపీలో కొత్తగా 3,676 కరోనా కేసులు!

coronavirus updates In AP : ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,881 కరోనా టెస్టులు చేయగా 3,676 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,79,146కు చేరుకుంది

Krishna
Published on: 17 Oct 2020 7:31 PM IST
ఏపీలో కొత్తగా 3,676 కరోనా కేసులు!
X

coronavirus updates In AP : ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,881 కరోనా టెస్టులు చేయగా 3,676 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,79,146కు చేరుకుంది. అయితే ఇందులో 37,102 యాక్టివ్ కేసులుండగా, 7,35,638 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనాతో మరో 24 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 6,406కు చేరుకుంది.

ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 69,91,258 కరోనా పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా ఐదుగురు కరోనాతో మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో 4 చొప్పున, విశాఖలో 3, అనంతపురం, తూర్పు గోదావరిలో 2 చొప్పున మృతి చెందారు. నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.


Krishna

Krishna

Next Story