ఏపీలో 303 కు పెరిగిన కరోనావైరస్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది.

K V D Varma
Updated on: 6 April 2020 8:01 PM IST
ఏపీలో 303 కు పెరిగిన కరోనావైరస్ కేసులు
X
Representational Image

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. ఈరోజు (ఏప్రిల్ 6) ఇప్పటివరకూ కొత్తగా 37 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కి చేరింది. జిల్లాల వారీగా చూస్తే ఈరోజు కర్నూల్ లో 18, నెల్లూరు లో 8, పశ్చిమ గోదావరి లో 5, కడప లో 4, కృష్ణ మరియు ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

జిల్ల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..

విశాఖపట్నం 20, తూర్పు గోదావరి 11, పచ్చిమగోదావరి 21, కృష్ణా 29, గుంటూరు 32, ప్రకాశం 24, నెల్లూరు 42, కడప 27, కర్నూల్ 74, చిత్తూరు 17, అనంతపురం 6.






K V D Varma

K V D Varma

Next Story