ఏపీలో 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 74,919 కరోనా టెస్టులు చేయగా, 3,342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 24 Oct 2020 5:34 PM IST
ఏపీలో 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
X

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 74,919 కరోనా టెస్టులు చేయగా, 3,342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,04,026 కి చేరుకుంది. అయితే ఇందులో 31,469 యాక్టివ్ కేసులుండగా, 7,65,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే 6,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 22 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,556కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. కడప, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 131, చిత్తూరులో 404, ఈస్ట్ గోదావరిలో 445, గుంటూరులో 378, కడపలో 203, కృష్ణాలో 344, కర్నూల్ లో 60, నెల్లూరులో 98, ప్రకాశంలో 266, శ్రీకాకుళం 112, విశాఖపట్నం 244, విజయనగరం 106, వెస్ట్ గోదావరి 551 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఎపీలో 75,02,993 కరోనా టెస్టులు నిర్వహించారు.


Krishna

Krishna

Next Story