Covid19 Updates: ఏపీలో ప్రమాద ఘంటికలు.. బెజవాడను వణికిస్తున్న మహమ్మారి..

Covid19 Updates: ఏపీలో ప్రమాద ఘంటికలు.. బెజవాడను వణికిస్తున్న మహమ్మారి..
x
Highlights

కరోనా భూతం ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ‌్య పదివేలు దాటింది. కొన్ని జిల్లాల్లో ఏకంగా...

కరోనా భూతం ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ‌్య పదివేలు దాటింది. కొన్ని జిల్లాల్లో ఏకంగా లాక్ డౌన్ విధించారు. రానున్న రోజుల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో అని జనం భయాందోళన చెందున్నారు. తాజాగా ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటు భక్తుల్లో, అటు ఉద్యోగుల్లో టెక్షన్ మొదలైంది. మొత్తానికి అడుగు బయట పెట్టాలంటనే వణికిపోతున్నారు ఏపీ ప్రజలు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రక్కసి విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 10వేల 3వందల 31కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేల 4వందల23 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4వేల 7వందల 79 మందికి నయమైంది. ఇప్పటి వరకు 129 మందిని కరోనా బలితీసుకుంది.

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపింది. లక్ష కుంకుమార్చన నిర్వహించే అర్చకుడికి పాజిటివ్ అని తేలడంతో అటు ఆలయ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అర్చకుడిని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అతడి సన్నిహితులను క్వారంటైన్ కు తరలించారు.

లాక్‌డౌన్ తర్వాత కనకదుర్గమ్మ దర్శనానికి ఈ నెల 10 నుంచి భక్తులను అవకాశం కల్పిస్తున్నారు. సాధారణ భక్తులకు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రూ.300 టికెట్లను రద్దు చేశారు.. తీర్థాలు, శఠగోపాలు లేవు. భక్తులందరూ భౌతిక దూరం పాటించేలా మాస్క్‌లు ధరించాలే జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలాగే ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే అనంతపురం, ఒంగోలు, ఏలూరు, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. రాజమండ్రి, కాకినాడలోనూ కరోనా కేసులు విస్తరిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించారు.

కరోనావైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి రికార్డ్‌ సృష్టించింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది జగన్ ప్రభుత్వం. అయితే కరోనాను రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడాలో మల్లగుల్లాలు పడుతోంది ఏపీ ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories