Coronavirus: ఏపీలో మరో 448 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 24 Jun 2020 1:28 PM IST
Coronavirus: ఏపీలో మరో 448 కరోనా పాజిటివ్‌ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 448 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,047 శాంపిల్స్‌ని పరీక్షించగా 448 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 146 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, శ్రీకాకుళం లో మరొకరు మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 8306. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 129. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3712కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4465 మంది చికిత్స పొందుతున్నారు.





Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story