Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 15,968 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 24 Jun 2020 9:16 AM IST
Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 15,968 కరోనా పాజిటివ్‌ కేసులు
X

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 15,968 కేసులు నమోదు కాగా, 465 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 4,56,183 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,83,022 ఉండగా, 2,58,684 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 14,476 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,15,195కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు. ఇప్పటి వరకు దేశంలో 73,52,911కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story