Corona Effect on TTD: కరోనా ఎఫెక్ట్ .. టీటీడీ అలెర్ట్!

Corona Effect on TTD: కరోనా ఎఫెక్ట్ .. టీటీడీ అలెర్ట్!
x
CORONA EFFECT ON TTD
Highlights

Corona Effect on TTD: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో టీటీడీ అలెర్ట్ అయింది. తిరుమ‌ల‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్షలు ముమ్మరంగా చేయాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు.

Corona Effect on TTD: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో టీటీడీ అలెర్ట్ అయింది. తిరుమ‌ల‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్షలు ముమ్మరంగా చేయాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. కరోనా టెస్టులకి సంబంధించి ట్రూనాట్ మిష‌న్లను కొనుగోలు చేయాలనీ అన్నారు. ఈ రోజు (సోమ‌వారం) సాయంత్రం త‌న ఛాంబ‌ర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా బారినా పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఉచ్చితంగా ఉద్యోగులకి అందించాలని అయన అధికారులను ఆదేశించారు. ఇక ఉద్యోగులు కూడా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగులంద‌రికీ ప్రత్యేకంగా గ‌దులు కేటాయించాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. అటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో నిరంత‌రం స‌మ‌న్వయం చేసుకోవాల‌ని టీటీడీ ఆరోగ్య శాఖాధికారిని ఈ సందర్భంగా ఈవో ఆదేశించారు.

ఇక శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎవరికీ కరోనా సోకలేదని, ఈ మేరకు దర్శనం అనంతరం ఇంటికి వెళ్ళిన భక్తులతో టీటీడీ సిబ్బంది ఫోన్ ద్వారా వారి ఆరోగ్యం గురించి వివ‌రాలు తెలుసుకున్నట్లుగా అయన వెల్లడించారు.

అటు టీటీడీ అధికారులతో ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఫోన్ లో స‌మీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉద్యోగులను ఉద్దేశిస్తూ మాట్లాడిన అయన.. ఉద్యోగుల ఆరోగ్య విష‌‌యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల‌ని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్యం విష‌యంలో ఖ‌ర్చుకు అస్సలు వెనకాడకూడదని అయన అధికారులకి సూచించారు.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గడిచిన 24 గంటల్లో 1,263 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 424 మంది డిశ్చార్జ్ కాగా, 7 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17,365 కి చేరుకుంది. మృతుల సంఖ్య 239గా ఉంది.. ఇప్పటి వరకు 7252 మంది డిశ్చార్జ్ కాగా, 9874 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories