Sumalatha Ambareesh tests positive for COVID-19: సినీ నటి సుమలతకి కరోనా పాజిటివ్!

Sumalatha Ambareesh tests positive for COVID-19: సినీ నటి సుమలతకి కరోనా పాజిటివ్!
x
Highlights

Sumalatha Ambareesh tests positive for COVID-19: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఇక ఇప్పటికే సినీ స్టార్స్ చాలా మంది కరోనా బారిన పడ్డారు.

Sumalatha Ambareesh tests positive for COVID-19: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఇక ఇప్పటికే సినీ స్టార్స్ చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా సినీ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు ఆమెకి కనిపించగా, పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఆ రిపోర్ట్ రాగా అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.

ఇక తానూ కాంటాక్ట్ అయిన వ్యక్తుల జాబితాను అధికారులకి వెల్లడించారు సుమలత. ఇక తనని కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని సుమలత ధీమా వ్యక్తం చేశారు. అటు కరోనా సమయంలో తన పార్లమెంట్ స్థానం అయిన మాండ్యాలో పర్యటించిన ఆమె ప్రజలకు కరోనా పైన అవగాహన కల్పించారు.

సుమలత 90 వ దశకంలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా ఆమె నటించింది. ఇక 1992లో కన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. అటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కర్ణాటాక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పైన భారీ విజయం సాధించారు.

ఇక భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 24,248 కేసులు నమోదు కాగా, 425 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,97,413 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,53,287 ఉండగా, 4,24,433 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 19,693 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,80,956 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 99,69,662 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories