ఏపీ రోడ్లకు మహర్దశ.. రహదారుల అభివృద్ధికి 2168 కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశం!

ఏపీ రోడ్లకు మహర్దశ.. రహదారుల అభివృద్ధికి 2168 కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశం!
x

Roads 

Highlights

CM Jagan Review : రహదారులు భవనాల శాఖపై తన క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఎం.శంకరనారాయణ, ఆర్‌ అండ్‌ బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో పాటు, పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

CM Jagan Review : రహదారులు భవనాల శాఖపై తన క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఎం.శంకరనారాయణ, ఆర్‌ అండ్‌ బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో పాటు, పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రహదారుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. వెంటనే అన్ని చోట్ల వీటికి అవసరమైన మరమ్మతులు చెప్పట్టాలని అధికారులకి జగన్ సూచించారు.

అయితే వాహనాల రద్దీని బట్టి ప్రయారిటీ ఇస్తూ రహదారులు బాగు చేయాలనీ జగన్ సూచించారు. వంతెనలు, అప్రోచ్‌ రహదారులు, ఆర్‌ఓబీలు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఆయా రహదారులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జగన్ సూచించారు. ఇక మున్సిపాలిటీలలో కూడా రహదారుల విస్తరణ చేపట్టాలని అన్నారు.

రాష్ట్ర రహదారులు, జిల్లాలలో ముఖ్య రహదారుల మరమ్మతు పనులకు అవసరమైన నిధులు రూ.2168 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యంగా రహదారులపై రాకపోకలు సజావుగా సాగేలా, గుంతలు వెంటనే పూడ్చి, ప్యాచ్‌ వర్క్‌ చేపట్టాలి. ఆ మేరకు దాదాపు 3 వేల కి.మీ రహదారులపై ప్యాచ్‌ వర్క్‌ కోసం దాదాపు రూ.300 కోట్లు అవసరమవుతాయన్న అధికారులు జగన్ కి సూచించారు.

అయితే వాటికి కూడా వెంటనే ఆ నిధులు కూడా మంజూరు చేసి, పనులు మొదలయ్యేలా చూడాలన్న సీఎం వారికి సూచించారు. ఎన్‌డీబీ ఆర్థిక సహాయంతో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి రెండు నెలల్లో రీటెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories