ఏపీలో సినిమా షూటింగ్ లకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఏపీలో సినిమా షూటింగ్ లకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
x

shootings 

Highlights

Cinema Shootings In AP : కరోనా వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని మార్గదర్శకాలతో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది.

Cinema Shootings In AP : కరోనా వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని మార్గదర్శకాలతో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ మార్గదర్శకాలతో పాటుగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల షూటింగ్ లకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ విషయాన్నీ రాష్ట్ర ఫిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా అయన వెల్లడించారు.

మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందన్నారు. చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అయితే సినిమా షూటింగ్ ల సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటుగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాలని అయన కోరారు..

మార్గదర్శకాల ఇవే!

♦ టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాల్సి ఉంటుంది.

నటీనటులకు మాత్రం షూటింగ్ సమయంలో మాస్క్ ధరించడం పట్ల కొంత మినహింపు ఉంటుంది.

సినిమా సెట్లోని పరికరాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది.

షూటింగ్‌లో పాల్గొనే టెక్నీషియన్లు, నటీ నటులు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లను ఉపయోగించుకోవాలి.

సెట్లో కచ్చితంగా అరుడుగుల దూరం పాటించాల్సి ఉంటుంది.

ఇక సినిమాకి ముందు, విరామ సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించాలి.

వీటికి సంబంధించిన వివరాలను www.apsftvtdc.inలో పొందుపరిచినట్టుగా అయన వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories