Hindustan Shipyard Accident: హిందూస్థాన్‌ షిప్‌యార్డు ఘటనపై సీఎం జగన్‌ ఆరా

Arun Chilukuri
Published on: 1 Aug 2020 3:59 PM IST
Hindustan Shipyard Accident: హిందూస్థాన్‌ షిప్‌యార్డు ఘటనపై సీఎం జగన్‌ ఆరా
X

Hindustan Shipyard Accident: విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది. షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ సామర్థ్యం పరీక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో క్రేన్‌ కేబిన్‌లో 15 మంది ఉన్నట్లు అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. షిప్‌యార్డులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. కార్మికుల మృతిపై సీఎం జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు.

వారంతా క్షేమంగా ఉండాలి: చంద్రబాబు

విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని అంటున్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story