people dream capital amravathi chandrababu : గవర్నర్ నిర్ణయంపై చంద్రబాబు స్పందన

people dream capital amravathi chandrababu : గవర్నర్ నిర్ణయంపై చంద్రబాబు స్పందన
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో...

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై లెజిస్లేచర్ క్యాపిటల్ గా అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్ కర్నూలు అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు. దీంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన స్పందన తెలియజేశారు. అమరావతి రాజధాని ప్రజల కల అని దానిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కరోనాతో బాధపడుతుంటే..

రాష్ట్రంలో రాజధాని చిచ్చు పెట్టారని అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు భూములిస్తామని స్వచ్చందంగా ముందుకొస్తే వారి ఆశలను సర్వనాశనం చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలని చెప్పారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధానిగా అమరావతిని ఒప్పుకున్నారని, ఇప్పుడు మాటమార్చి మడమతిప్పారని అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం చేస్తుంటే ఉద్యమాన్ని అనచివేయడానికి ప్రభుత్వ పరంగా దుర్మార్గంగా ప్రవర్తించారని, రాష్ట్రంలో అనైతిక పాలనపై గవర్నర్‌ బిశ్వభూషన్‌కు ఫిర్యాదుచేస్తే పట్టించుకోకుండా.. గవర్నరే రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం ఏంటని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories