మదనపల్లె అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. ఘటనాస్థలానికి హెలికాఫ్టర్‌లో వెళ్లాలని డీజీపీకి ఆదేశం

Fire Accident In Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 July 2024 12:23 PM IST
Chandrababu Furious on Madanapalle Fire Accident, Orders Probe
X

మదనపల్లె అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. ఘటనాస్థలానికి హెలికాఫ్టర్‌లో వెళ్లాలని డీజీపీకి ఆదేశం

Fire Accident: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఆఫీసు లోపల కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

కీలక ఫైల్స్‌ అగ్నిప్రమాదంలో దగ్ధం అయ్యాయని ప్రచారం జరుగుతోంది. నూతన సబ్ కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు.. ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదమా.. కుట్ర పూరితమా అనే అంశంపై విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భూములకు సంబంధించి కీలక ఫైల్స్‌ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. వెంటనే ఘటనాస్థలానికి హెలికాఫ్టర్‌లో వెళ్లాలని డీజీపీకి ఆదేశించారు. డీజీపీ, సీఐడీ చీఫ్ కాసేపట్లో మదనపల్లెకు బయల్దేరనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story