హోదా సాధ్యం కాదని చెబుతున్నా జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు : పురందేశ్వరి

K V D Varma
Published on: 21 July 2019 5:31 PM IST
హోదా సాధ్యం కాదని చెబుతున్నా జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు : పురందేశ్వరి
X

ఏపీ కి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెబుతున్నా ఏపీ సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. జగన్ వైఖరి సరైనది కాదని ఆమె అన్నారు. తెనాలిలో ఈరోజు మీడియా తో మాట్లాడిన పురందేశ్వరి జగన్ విధానాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. గ్రామ సచివాలయ విధానంతో అనేక మందికి ఇబ్బందులు తలెత్తుతాయని పురందేశ్వరి అన్నారు. రేషన్‌ డీలర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు. ఇసుక, మట్టి విధానంలో ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. బీజేపీ లోకి పలువురు నేతలు వస్తున్నారని, ఇది సంతోషించదగ్గ పరినామమనీ ఈ సందర్భంగా ఆమె చెప్పారు.

K V D Varma

K V D Varma

Next Story