కరోనా కీట్లు అందకపోతే వారిదే భాద్యత.. సమీక్షలో సీఎం జగన్

కరోనా కీట్లు అందకపోతే వారిదే భాద్యత.. సమీక్షలో సీఎం జగన్
x

YS Jagan Mohan Reedy

Highlights

CM YS Jagan video conference : కరోనా నివారణ చర్యల పైన ఏపీ సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.

CM YS Jagan video conference : కరోనా నివారణ చర్యల పైన ఏపీ సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని అన్నారు. కరోనా టెస్టులు పెరిగినప్పటికి కేసులు తగ్గాయని అన్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3కి తగ్గిందని అన్నారు. కరోనా వ్యాప్తి తగ్గుతుంది అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు జగన్.. కరోనాని ఆరోగ్య శ్రీ కింద ట్రీట్ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని, కోవిడ్‌ హాస్పిటల్స్‌ లిస్ట్‌ గ్రామ సచివాలయాల్లో ఉండాలన్నారు.

ఇక కోవిడ్ సెంటర్లలలో కచ్చితంగ ఫుడ్ సప్లై, శానిటైజేషన్, ఇన్‌ఫ్రా, స్టాఫ్‌ అన్నీ సరిగ్గా జరగాలని అన్నారు. అటు హోం ఐసోలేషన్లో ఉన్న వారికి కరోనా కిట్లు అందకపోతే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లదే ఆ బాధ్యత అని తెలిపారు. కోవిడ్‌ బాధితులను త్వరగా గుర్తించడం వలనే మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. 104కు ఎవరు ఫోన్‌ చేసినా కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని చెప్పారు. రిక్రూట్‌ చేసిన వారంతా కూడా కరెక్ట్‌గా డ్యూటీకి వెళుతున్నారా లేదా తనిఖీ చేయాలని సీఎం పేర్కొన్నారు.ఇక జనవరికల్లా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,78,266 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో 6,09,405 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 63,116 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనాతో ఇప్పటివరకు 5,745 మంది మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories