థాంక్యూ సీఎం జగన్‌: కమల్‌ హాసన్‌

Arun Chilukuri
Published on: 29 Sept 2020 12:56 PM IST
థాంక్యూ సీఎం జగన్‌: కమల్‌ హాసన్‌
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విలక్షణ నటుడు కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ తెలిపారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు 'భారతరత్న' ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనపై నటుడు కమల్‌ హాసన్‌ స్పందించారు.

బాలుకి భారత రత్న ఇవ్వాలని కోరినందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ట్విటర్‌లో పోస్టు చేశారు. 'మన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. సరైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.' అంటూ పేర్కొన్నారు. తమ అభిమాన గాయకుడు బాలుకు భారత రత్న ఇవ్వాలంటూ ప్రధాని మోదీకు వైఎస్ జగన్ లేక రాయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎస్పీ బాలు అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story