కరోనాతో ఎంసెట్‌ రాయలేకపోయిన వారికి మరో అవకాశం

కరోనాతో ఎంసెట్‌ రాయలేకపోయిన వారికి మరో అవకాశం
x
Highlights

కొవిడ్‌ తో క్వారంటైన్‌లో ఉండి ఎంసెట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి ఆ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఎంసెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి...

కొవిడ్‌ తో క్వారంటైన్‌లో ఉండి ఎంసెట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి ఆ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఎంసెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌కు హాజరు కాలేకపోయిన కొవిడ్‌ బాధిత విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు వీసీ రామలింగరాజు తెలిపారు. ఈ విద్యార్థులు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ మెయిల్‌ ఐడీ [email protected]కు ఎంసెట్‌ హాల్‌ టికెట్‌తోపాటు, కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టును ఈనెల 30 సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని కోరారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories