ఏపీలో 'పది' పరీక్షలు యధాతధంగా జరుగుతాయి : మంత్రి ఆదిమూలపు సురేష్‌

Samba Siva Rao
Updated on: 10 Jun 2020 6:20 PM IST
ఏపీలో పది పరీక్షలు యధాతధంగా జరుగుతాయి : మంత్రి ఆదిమూలపు సురేష్‌
X

ఏపీలో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారమే జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కాకపోతే 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

విద్యార్థులను అనవసరమైన ప్రచారాలతో గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పదోవ తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఏపీలో కూడా పది పరీక్షలను రద్దవుతాయ‌నే ప్ర‌చారం జరుగుతున్న నేప‌థ్యంలో మంత్రి సురేష్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story