Akkineni Nagarjuna: పొలిటికల్ ఎంట్రీపై అక్కినేని నాగార్జున క్లారిటీ

Akkineni Nagarjuna: తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని వివరణ

Rama Rao
Updated on: 30 Sept 2022 9:30 PM IST
Akkineni Nagarjuna Clarity on Political Entry | Telugu News
X

Akkineni Nagarjuna: పొలిటికల్ ఎంట్రీపై అక్కినేని నాగార్జున క్లారిటీ

Akkineni Nagarjuna: రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై హీరో అక్కినేని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే త‌న‌కు లేనే లేదన్నారు. విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అంతేకాకుండా ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తి సారి ఇలాగే ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆయ‌న ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో నాగార్జునకు స‌న్నిహిత సంబంధాలు ఉండటం.. 2014, 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లో వైసీపీ ఓట‌మిపాలైన నేపథ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ లోక్ స‌భ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారంటూ కొన్ని రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. ఈనేపథ్యంలో నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story