ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ప్రకాశం జిల్లా కొమరవోలు మండలానికి చెందిన కోనేటి సుధాకర్‌ ఆత్మహత్యాయత్నం

K V D Varma
Published on: 20 Oct 2019 11:12 AM IST
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన పై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలానికి చెందిన కోనేటి సుధాకర్‌ ఈ ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు.

ప్రకాశం జిల్లాలోని గృహ నిర్మాణ సంస్థ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఆ సంస్థలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న తన భార్యకు పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అయన సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళడానికి క్యాంప్ ఆఫీసు వద్దు వచ్చాడు. క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళడానికి ప్రయత్నించే సమయంలో సీఎం అపాయింట్‌మెంట్‌ లేనివారిని అనుమతించేది లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడనుంచి పక్కకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న సీసాలో పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. దీనిని గమనించి పోలీసులు అప్రమత్తమై అతడిని నిలువరించారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదుచేశారు.


K V D Varma

K V D Varma

Next Story