ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు!

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 88,778 కరోనా టెస్టులు చేయగా 2,905 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 29 Oct 2020 7:01 PM IST
ఏపీలో కొత్తగా  2,905 కరోనా కేసులు!
X

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 88,778 కరోనా టెస్టులు చేయగా 2,905 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,17,679 కి చేరుకుంది. అయితే ఇందులో 26,268 యాక్టివ్ కేసులుండగా 7,84,752 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 16 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,659కి చేరుకుంది.

కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కడపలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, పచ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 221, చిత్తూరులో 259, ఈస్ట్ గోదావరిలో 414, గుంటూరులో 359, కడపలో 191, కృష్ణాలో 361, కర్నూల్ లో 25, నెల్లూరులో 96, ప్రకాశంలో 206, శ్రీకాకుళం 90, విశాఖపట్నం 119, విజయనగరం 70, వెస్ట్ గోదావరి 494 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 78,62,459 కరోనా టెస్టులు నిర్వహించారు.



Krishna

Krishna

Next Story