ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,082 కరోనా టెస్టులు చేయగా 2,367 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Krishna
Published on: 7 Nov 2020 6:57 PM IST
ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు
X

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,082 కరోనా టెస్టులు చేయగా 2,367 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,40,730 కి చేరుకుంది. అయితే ఇందులో 21,434 యాక్టివ్ కేసులుండగా 8,03,622 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 2,747 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 11 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,779కి చేరుకుంది.

కృష్ణా జిల్లాలో 3, అనంతపూర్ లో 2, చిత్తూరులో 2, తూర్పుగోదావరి, కడప, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 61, చిత్తూరులో 255, ఈస్ట్ గోదావరిలో 386, గుంటూరులో 226, కడపలో 131, కృష్ణాలో 358, కర్నూల్ లో 37, నెల్లూరులో 153, ప్రకాశంలో 84, శ్రీకాకుళం 102, విశాఖపట్నం 135, విజయనగరం 78, వెస్ట్ గోదావరి 361 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 85,87,312 కరోనా టెస్టులు నిర్వహించారు.



Krishna

Krishna

Next Story